ఒక చిన్న మాట

Sai
2 min readJan 3, 2022

కూతల రాయుడు అనే ఈ పుస్తకం ఇన్ని ప్రతులు అమ్మాలని గానీ, ఎంతో కొంత డబ్బు సంపాదించాలని గాని మొదలుపెట్టిన ప్రయత్నం కాదు. ఇది కేవలం ఒక మిత్రుడి(@iam_nmsr)* ప్రేమ మాత్రమే. ఈ ప్రయత్నానికి వచ్చిన ఆదరణ చూసి నా మనసుకి బాగా దగ్గరైన, పెద్ద మనసున్న మిత్రులు ఒక సూచన చేశారు. ఈ పుస్తకం ద్వారా ఒక పది మందికి మేలు జరిగితే బాగుంటుందని. ఆ మేలు ఏమిటి ? అన్న మధనంలోంచి సోదరుడు ఆదిత్య (@vizagobelix)* చిలికి తెచ్చిన సమాధానం ప్రియ నేస్తం ఛారిటబుల్ ట్రస్ట్. ఆదివాసీ పిల్లలకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ప్రాధమిక విద్యను అందిస్తున్న సంస్థ ప్రియ నేస్తం ఛారిటబుల్ ట్రస్ట్. ఈ సంస్థ ములుగు జిల్లాలోని కొన్ని ఆదివాసీ కేంద్రాలలో (రాయబందం, కొమురం భీం నగర్, మోట్లగూడెం…) ఉచిత ప్రాధమిక విద్యను అందిస్తున్నారు. నా మిత్రులు కొందరు ఇటీవలే ఒక జట్టుగా చేరి ఈ విద్యా కేంద్రాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను నేరుగా గమనించారు. మా స్నేహితురాలు భానుగారు (@dhanvihrudya)* #RedExpress పేరిట ఆదివాసీ స్త్రీలకు ఋతు సంబంధిత ఆరోగ్య విషయాల గూర్చి ఎంతో చక్కటి సమాచారాన్ని కూడా అందించారు. మిత్రుల ద్వారా నాకు అందిన సమాచారం ప్రకారం అక్కడి కొన్ని ప్రదేశాలను చేరుకోవడమే అత్యంత కష్టంతో కూడుకున్న పని. అటువంటిచోట విద్యా కేంద్రం నడపడం కత్తి మీద సామే. ప్రతి విద్యా కేంద్రంలో సుమారుగా ముప్పై మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరందరి చదువుకు, పుస్తకాలకు, ఇతరత్రా స్టేషనరీ ఖర్చులకూ సాలీనా ₹75000 నుండి ₹90000 వరకు ఖర్చు అవుతుందని అంచనా. వీరందరి విద్య కోసం ఎంతో తాపత్రయంతో పని చేస్తున్న నిత్య కృషీవలుడు నాగరాజు పింగళి గారు(@NagPingili)*. నాగరాజుగారి కృషి అభినందనీయం. వారికి మా ఉడుతా సాయంగా ఈ పుస్తకం ద్వారా వచ్చిన విరాళలను అందించాలన్నదే మా ఈ ప్రయత్నం. మేము చేపట్టిన ఈ సేవా కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మా అభిలాష. అందులో భాగంగా ఈ పుస్తకం ముద్రణా మరియు రవాణా ఖర్చులు (₹120) తగ్గకుండా మీకు నచ్చినంత ఎక్కువ విరాళాన్ని ఇచ్చి ఈ సత్కార్యాన్ని ముందుకు నడిపించగలరని మా విన్నపం. మీరు ఈ పుస్తకం కోసం అందించే ప్రతి రూపాయి ఈ విద్యా దానమనే సేవా కార్యక్రమానికి మాత్రమే వినియోగించబడుతుందని నా తరుపునా, నా మిత్రుల తరపునా రూఢీగా చెప్తున్నాను.

ఈ ప్రయత్నాన్ని మరింత ముందుకు నడిపేందుకు మీకు అదనపు ప్రతులు కావాలనుకుంటే సంప్రదించవలసిన మొయిల్ ఐడీ: koothalarayudu@gmail.com మీ కోసం ఆ పాఠశాలలకు సంబంధించిన కొన్ని చిత్రాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను.

shorturl.at/bnrNO

పుస్తకం కోసం ఈ క్రింది లంకెలో మీ వివరాలను పంపండి. మీ వివరాలు, విరాళాలు అందగానే మీకు పుస్తకం పోస్తూ ద్వారా పంపబడుతుంది. వివరాలు ఇవ్వగోరని వారు అమెజాన్లో పుస్తకాన్ని కొనుగోలు చేసి మీ సాయాన్ని అందించవచ్చు.

అమెజాన్:

గూగుల్:

మీ వివరాలు ఇక్కడ పొందుపరచవచ్చు.

ఫోన్ పే వివరాలు:

ధన్యవాదాలు.

*ట్విట్టర్ హ్యాండిల్స్.

--

--