కృతజ్ఞతాభివందనం — విద్యానేస్తం

Sai
3 min readApr 9, 2022

“మీరు ఇంకొన్ని కథలు వ్రాస్తే పుస్తకం అచ్చు వేసేయచ్చు సాయిగారు”.

“ఒక నూటయాభై పేజీలు వస్తే పుస్తకం అచ్చు వేసేయచ్చు సాయి గారు”.

నేను మీడియంలో ఏదైనా కొత్త కథ ప్రచురించగానే మధు కథ మీద తన రివ్యూ చెప్పాక అనే మాటలు.

ఆ మాటలు ఎంతో ఉత్సాహాన్ని నింపేవి. ఇంకా బాగా వ్రాయాలి అన్న ఉత్తేజాన్ని నరనరాల్లోకి పంపేవి.

వీడు బాగా వ్రాస్తాడు కానీ ఇంకా బాగా వ్రాయాలి, అన్న గురువుగారు చందూగారి ప్రశంసా హెచ్చరికలు. ఇంకా తెలుసుకుని వ్రాయాలి, ఆలోచించి, నాతో నేను తర్కించి వ్రాయాలన్న జాగ్రత్తను పెంచేవి.

ఈ రోజుల్లో మనకి బాగా పరిచయం ఉన్న స్నేహితులు, బంధువులే మన కోసం ఒక రోజు సమయం వెచ్చించాలన్న, సాయం చేయాలన్న ఎంతో ఆలోచిస్తారు. అలాంటిది కేవలం ఒక్క జ్ఞాపకం అనే దారంతో జీవితకాలం పదిలంగా దాచుకునేలా ఈ కథల హారాన్ని బహుకరించిన మధుకి నా జీవితకాల స్నేహం, నేను తిరిగి ఇవ్వగలిగిన బహుమానం.

మీలోఎంతో మంది కురిపించిన ప్రశంసలకు కృతజ్ఞుడిని. కొన్ని కొన్ని నాతో పాటు చివరికంటా గుర్తుండిపోతాయి, నేను అలసిపోయినప్పుడు నాకు ఆలంబనలు అవుతాయి, దిగాలుగా ఉన్నప్పుడు నన్ను నడిపిస్తాయి.

ముందు మాట వ్రాసిన తెలుగు ట్విట్టర్ సమ్మోహనకారుడు అన్నయ్య కృష్ణ మోహనుడికి ప్రేమ పూర్వక ఆలింగనం.

నా కథలను ప్రోత్సహించి నన్ను వెన్ను తట్టి నడిపించిన నాగ్ వాసిరెడ్డి గారికి, అరుణ్ అన్నకి, కృష్ణన్నకి, శ్రీలతగారికి, మాధురి గారికి, ఆంజనేయులు గూడపాటిగారికి, సుంకర లీలాకృష్ణగారికి, వారణాసి శర్మగారికి, కళ్యాణ్ మేకలగారికి, జనసైనికుడుగారికి, దేవన్నకి, దివ్య ముదునూరిగారికి, ఋతుపర్ణం కథను పదే పదే మననం చేసుకునే ఆకాష్‌గారికి, కిషోర్‌గారికి మరెందరో పాఠకులకు వేవేల ధన్యవాదాలు.

ఈ పుస్తకాన్ని ఏదైనా మంచి పని ద్వారా పరిచయం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన చందూగారిది, ఆచరణ మధుది. మార్గదర్శి సోదరుడు ఆదిత్య అయితే ఆ మంచి పని తలకెత్తుకున్న మహామనీషి నాగ్ పింగళిగారు. ఆయన చేస్తున్న ఈ మహోన్నతమైన సేవకు ప్రభుత్వం తరఫు నుంచి తగిన గుర్తింపు లభించాలని ఆశిస్తాను. ఇంత మంది మంచివారు ఈ కార్యక్రమంలో భాగమైనందువల్లే ఈ మంచిపని ఇంత తేలికగా సాగిపోయింది.

కోటానుకోట్ల వ్యాపారం చేసే సినిమాలకు స్క్రిప్ట్ వ్రాసే వారయ్యుండీ ఇంత చిన్న పుస్తకం మీద ఆసక్తి చూపించడమే కాకుండా ఈ పుస్తకాన్ని ప్రోత్సహించిన ఎస్.ఎస్. కాంచిగారికి సదా కృతజ్ఞుడిని.

అడిగిందే తడవుగా బోల్డు సమయం వెచ్చించి, తన ప్రచురణ సంస్థ అజూ పబ్లికేషన్స్ చేస్తున్న పుస్తకాల పంపిణీలో తలమునకలైయ్యుండి కూడా, కూతల రాయుడు పుస్తకాన్ని అమెజాన్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసి, #విద్యానేస్తం అనే ఈ కార్యక్రమానికి ఎనలేని మేలు తలపెట్టిన మల్లన్నకు నా ప్రేమ.

పుస్తకం అచ్చు వేసిన దగ్గర్నుంచి విద్యానేస్తంకి నిధులు అందే దాకా అడుగడుగునా సాయపడిన సుస్మితగారికి, భానుగారికి, రాధికగారికి, గోగుల నారాయణ గారికి పుస్తకాన్ని విడుదల చేసిన అరుణ్ భాగవతులగారికి వేవేల నెనరులు.

గోరంత ఈ కార్యక్రమాన్ని కొండంత చేసిన కేకే ( ట్వీటేశ్వరుడు) గారికి, శశిగారికి తమ దొడ్డ మనసును చాటుకున్న రామడుగు గౌతమ్ గారికి ప్రేమ పూర్వక కృతజ్ఞతలు.

ఈ పుస్తకాన్ని ఎన్నో ప్రతులు కొని ఎంతో మందికి పరిచయం చేసిన కళ్యాణి ముక్తేవిగారికి, జ్యోతి కళ్యాణం గారికి, ఈ పుస్తక ప్రతులను వితరణగా ఇచ్చిన శ్రీ లతగారికి, శ్రీ ( తెలుగు లెస్స ) గారికి, సావిత్రి గారికి,సౌమ్యా ఐనవల్లిగారికి, తమ పేర్లు గోప్యంగా ఉంచమన్న మరో ఇద్దరు మహిళా మూర్తులకి శతసహస్రప్రేమాభివందనాలు.

వాసంతి గారికి, మిస్టర్ అండ్ మిసెస్ మహీకి, కృష్ణ హరనాధ్ గారికి, తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేస్తున్న నానీ గారికి, లేఖిని ద్వారా తెలుగు వారి నెత్తిన పాలు బోసిన, పోస్తున్న వీవెన్ గారికి, సోదరులు బిందు మాధవ్‌, సాయి సుభాష్‌కి నా మనః పూర్వక ధన్యవాదాలు.

ఈ పుస్తకానికి ఎంతో అందమైన సమీక్షను వ్రాసి నాలో మరింత ఉత్సాహం నింపిన చెన్నూరి సీతారాంబాబుగారికి కృతజ్ఞతాభివందనం.

పోతుకూచి శ్రీధర్ గారికి, మా గౌస్సాబ్‌కి, సీతారామరాజు గారికి, శ్రీనాథ్ గారికి, వై. ఎస్. కాంత్ గారికి, అనురాధ గారికి, హిమజ గారికి, సోదరుడు ఆర్యన్‌ హరీష్‌కి, మధు పజీర్ గారికి, జీవన్ గారికి, జంపన సాయి వినీషరాజు గారికి, పేరేపి చైతన్య గారికి, నార్నె హేమలతగారికి, ఎం.వి. రావు ఐ.ఏ.ఎస్ గారికి, రాము, అనీల్, నాగేంద్ర, నాగవర్మ అజయ్ గార్లకు, సురక్షా ఫార్మా యాజమాన్యానికి నా నమః సుమాంజలి. సీతారామరాజు గారబ్బాయి చిరంజీవి అగస్త్యకు నా ముద్దులు, ఆశీర్వచనాలు.

ఈ పుస్తకాన్ని అచ్చు వేసి, అందరికీ త్వరిత సమయంలో అందజేసిన పల్లవి పబ్లికేషన్స్ నారాయణగారికి మనః పూర్వక ధన్యవాదాలు.

ఎవరినైనా మరచిపోయినా, ఎవరి పేరైనా తప్పుగా వ్రాసినా పెద్ద మనసు చేసుకుని క్షమించమని కోరుతున్నాను. ఈ మరపు ఇది వ్రాస్తున్న నలభై నిమిషాలదే కానీ జీవిత కాలానిది కాదు అని మనవి.

మీ అందరి ప్రేమ, ప్రోత్సాహాలతో మరిన్ని కథలు వ్రాస్తానని ఆశ. అవి మీ అందరికీ నచ్చాలని కాంక్ష.

సే-లవ్,

భవదీయుడు,

రాయుడు.

--

--