మాటలు

Sai
సాయుజ్యం
Feb 9, 2024

--

మాటలు. నీవీ కాదు, నావీ కాదు.

మనవి.

నా మౌనంలో నీవి, నీ మౌనంలో నావి.

అలకల్లో మన మౌనాలవి

అలజడిలో మన మనసులవి

మనం వ్రాసుకునే కవితలవి

ఆ కవితలు చేరే చరితలవి

నువ్వు నేనుగా, నేను నువ్వుగా అద్దంలో చూపేవి

మాటలు 💙

--

--